అల్లూరి సీతారామరాజు జిల్లా
మారేడుమిల్లి మండలంలోని తాడేపల్లి పంచాయితీ పరిధి నీలవరం గ్రామంలో సోమవారం బాణంతో దాడి చేయడంతో తుమ్ముడి. సుగ్గిరెడ్డి అనే గిరిజనుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. భూమి తగాదాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మారేడుమిల్లి పోలీసులు కేసు నమోదు చేసి సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నామని వివరాలు సేకరిస్తునట్లు తెలిపారు.