గాయపడిన కార్మికుడికి వైసిపి ఆర్థిక సహాయం
అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన కార్మికుడికి వైసిపి రూ. లక్ష ఆర్థిక సహాయం అందించింది. ఎలమంచిలి మండలం సోమలింగపాలెం గ్రామానికి చెందిన పిల్లా మెహర్ బాబా కుటుంబ సభ్యులకు ఎలమంచిలి ఎంపీపీ బి. గోవిందు మాజీ ఎంపీపీ ఎర్రయ్య దొర రూ. లక్ష చెక్కును శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి మున్సిపల్ వైస్ చైర్మన్ బి నాగేశ్వరావు పాల్గొన్నారు.