అనంతపురం: కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'స్వచ్ఛతా హీ సేవ' కార్యక్రమం ప్రిన్సిపాల్ జయరామరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం చేపట్టారు. కళాశాలలోని ప్లాస్టిక్ బాటిల్స్, కవర్స్, చెత్తను సేకరించి శుభ్రం చేశారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ. ప్రతి ఒక్క పౌరుడు ప్లాస్టిక్ వాడకుండా, పర్యవరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.