
యాడికి: ఆటో డ్రైవర్లకు పోలీసుల సూచనలు
యాడికి మండలవ్యాప్తంగా ఆటో డ్రైవర్లకు పోలీసులు సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. పదవ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఆటోలలో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తే చర్యలు తప్పవని యాడికి సీఐ ఈరన్న హెచ్చరించారు. విద్యార్థులను ఎక్కించుకునేటప్పుడు దించే తప్పుడు తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని రోడ్డుపై కాకుండా రోడ్డు సైడ్ సురక్షితమైన ప్రదేశంలో దించాలని సూచించారు.