

తాడిపత్రి: విద్యుత్ కేబుల్ వైర్లు దగ్ధం చేసిన దుండగులు
తాడిపత్రిలోని పెన్నానది ఒడ్డున బైపాస్ లో ఉన్న విద్యుత్ కేబుల్ వైర్లను కట్ చేసి సోమవారం పెన్నానదిలో కాల్చుతుండగా మున్సిపల్ కార్మికులు పట్టుకున్నారు. విద్యుత్ మోటర్లు ఆడలేదని చెక్ చేస్తున్న సమయంలో వారు అక్కడికి వెళ్ళారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు కేబుల్ వైర్లను కట్ చేసి మంటల్లో కాలుస్తున్నారు. ఈ మేరకు కార్మికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.