పోడియం పోయె.. టేబుల్ వచ్చె
తాడిపత్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం సబ్ రిజిస్ట్రార్ పోడియం తొలగించారు. కార్యాలయంలో ఎత్తయిన పోడియంపై కూర్చొని సబ్ రిజిస్ట్రార్ విధులు నిర్వర్తించేవారు. ఇది రాచరికపు పోకడను తలపిస్తోందని భావించిన ప్రభుత్వం పోడియం తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పోడియం తొలగించి టేబుల్, కుర్చీలు ఏర్పాటు చేశారు. సబ్ రిజిస్ట్రార్ శివనారాయణ సాధారణ కార్యాలయాల్లో మాదిరిగానే కుర్చీ, టేబుల్ పైన విధులు నిర్వర్తించారు.