తాడిపత్రి: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
తాడిపత్రి మండలంలోని చల్లవారిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం నీలూరు రామాంజనేయులు అనే వ్యక్తి అనారోగ్యం కారణంగా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్సై నాగప్ప తెలిపారు. రామాంజనేయులు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండేవాడని, ఆరోగ్యం బాగా కాదని భావించి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని జీఆర్పీ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.