తాడిపత్రిలో బలిజ సంఘం నాయకుల సమావేశం
తాడిపత్రిలో బలిజ సంఘం సమావేశాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బలిజ సంఘం నాయకులు మాసూల్ ప్రసాద్, దద్దం సుబ్బరాయుడు మాట్లాడుతూ వచ్చే నెలలో కార్తీక మాసం సందర్భంగా కళ్యాణ మండపంలో నిర్మించిన శ్రీ శివ కామేశ్వరి సీతారాముల ఆలయంలో పూజలు నిర్వహించడానికి అందరి సహకారం కావాలన్నారు. కార్తీక మాసంలో నెల రోజుల పాటు పూజలకు 3వేల రూపాయలు, ఒక్కరోజు పూజకు 500 రూపాయలు పూజలో పాల్గొన్నవారు చెల్లించే విధంగా తీర్మానించారు.