పద్మ భూషణ్ గుర్రం జాషువా స్మారక కళాపరిషత్ వారి అతిపెద్ద అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక,సేవా సంస్థ విజయవాడ వారు చెరుకూరి గంగులయ్య విశిష్ట సేవలనుగుర్తించారు. ఎస్సీ,ఎస్టీ, బడుగు, బలహీన వర్గాల వారికి తన విద్యార్థి దశనుండి అనేక సేవలు అందించారు. ఉపాధ్యాయ పదవి చేపట్టినప్పటి నుండి బడి మానివేసిన పిల్లలను తిరిగి చేర్పించడం, ప్రత్యేక క్లాసులు చెప్పించే వారు ఇవన్నీ గుర్తించి చెరుకూరి గంగులయ్యకి విజయవాడ బందర్ రోడ్డు ఠాగూర్ గ్రంథాలయం హాలు నందు గౌరవ డాక్టరేట్ అవార్డు అందజేసారు.