ధర్మవరం పట్టణం గుట్ట కింద పల్లి వద్ద ఉన్న పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడగా మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. అనంతపురం నుండి ఉపేంద్ర, నాగేంద్ర అనే వ్యక్తులు ద్విచక్ర వాహనంలో వస్తుండగా ధర్మవరం గుట్టకిందపల్లి వద్ద ఒక కారు ఢీ కొట్టింది. ఉపేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.