ధర్మవరంలో మహిళా ఇండస్ట్రియల్ పార్క్, స్టిచ్చింగ్ యూనిట్ పరిశ్రమ ఏర్పాటు చేసి ఆర్థికంగా చితికిపోయిన చేనేత కుటుంబాల మహిళలకు ఉపాధి కల్పించాలని ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసకి, బీసీ సంక్షేమ శాఖా మంత్రి సవితమ్మతో కలసి విజ్ఞప్తి చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా పెనుకొండకు వచ్చిన మంత్రి శ్రీనివాస్ ను సోమవారం పరిటాల శ్రీరామ్ కలిశారు ధర్మవరం ప్రాంతంలో చేనేతలు పడుతున్న ఇబ్బందులు వివరించారు.