కన్నుల పండుగగా కుంటు మారెమ్మదేవత సిడి మహోత్సవం
రాయదుర్గం పట్టణంలోని కోటవీధిలో వెలసిన కుంటు మారెమ్మ దేవాలయంలో సిడి మహోత్సవ కార్యక్రమం కన్నులపండుగగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి అమ్మవారికి అభిషేకాలు చేస్తూ ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిడి మహోత్సవాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తులు వచ్చారు.