ముద్దనూరు: తుపాన్ ధాటికి నేల కొరిగిన కొర్ర పంటల పరిశీలన
ముద్దనూరు మండలం యామవరం గ్రామంలో బుధవారం రైతుల కొర్ర పంటను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణారెడ్డి, తుఫాను ప్రభావం వల్ల పంటలు దెబ్బతినకుండా కొన్ని సూచనలు అందించారు. మూడు రోజుల తుఫాను వల్ల మురుగునీరు పొలాల్లో నిలబడి పంటలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, అందుకని మురుగు కాలువలు ఏర్పాటు చేయాలని చెప్పారు. రైతులకు తగు యాజమాన్య పద్ధతులు మరియు ముందస్తు చర్యలు సూచించారు.