మైలవరంలో అభివృద్ధి పనుల ప్రారంభం
మైలవరం, దొమ్మరనంద్యాల, వేపరాల గ్రామాలలో పంచాయతీ వారోత్సవాలను మంగళవారం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద మంజూరైన సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. మైలవరం గ్రామానికి రూ. కోటి, అలాగే దొమ్మర నంద్యాల గ్రామానికి రూ. కోటి 15 లక్షలు. ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఏంఆర్వో పాల్గొన్నారు.