
ముద్దనూరు: లారీ, టిప్పర్ ఢీ.. ఒకరి మృతి
కడప జిల్లా ముద్దనూరు మండలంలోని గంగాదేవి పల్లె గ్రామం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు తాడిపత్రి నుంచి కడప వైపు వెళ్తున్న లారీ, ముద్దనూరు నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న టిప్పర్ ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా మరొకరికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.