డాక్టర్ పై దాడి అమానుషం
దళిత డాక్టర్ పై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరుల దాడి సరికాదన్నారు పోరుమామిళ్లలో అంబేడ్కర్ సేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్యాల ప్రసాద్ రావు. వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సోమవారం ఆయన డిమాండ్ చేశారు. డాక్టర్ పై చేయి చేసుకోవడమే కాకుండా తన అనుచరులు కూడా అత్యంత అవమానకర రీతిలో ఆయనను కొట్టారని తెలిపారు.