పిచ్చి కుక్క వీరంగం సృష్టించి సుమారు 30మందిని గాయపరిచిన ఘటన ములకలచెరువు మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. మండలంలోని చౌడసముద్రం, సోంపాళ్యం, అడవిచెరువు, అడవినాయుని చెరువుపల్లె, కొత్తపల్లె, గట్టుకిందపల్లెల్లో పిచ్చికుక్క స్వైర విహారంచేసి, కనిపించినవారిని కనిపించినట్లే కరచి తీవ్రంగా గాయపరచింది. బాధితులను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు వివవరించారు.