ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 18వ తేదీ శనివారం మైదుకూరు పర్యటనను విజయవంతం చేసిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతమవడానికి తోడ్పడిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ, బద్వేల్ ఆర్డీవో, మునిసిపల్ కమీషనర్, తహసిల్దారు, విలేకరులకు కృతజ్ఞతలు తెలిపారు.