చీరాలలోని ఏపీ మోడల్ స్కూల్ లో జూనియర్ ఇంటర్ చదువుతున్న స్మైలీ అనే విద్యార్థిని శనివారం తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆ విద్యార్థినిని హుటాహుటిన చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ పాఠశాలలో దాదాపు 540 మంది విద్యార్థులు ఉండగా ఏఎన్ఎం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో వారికి వైద్య సేవలు అందలేదు. ప్రాణాల మీదకు వచ్చినా పట్టించుకునే వారు లేరన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.