గుంటూరు : కూటమి పాలనలో 3 మర్డర్లు, 6 అత్యాచారాలు
మూడు మర్డర్లు, ఆరు అత్యాచారాలతో కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ ఆరోపించారు. స్నేహితుడితో బయటకు వెళ్లి బ్రెయిన్ డెడ్ అయిన తెనాలి యువతి సహాన కుటుంబాన్ని మేరుగు నాగార్జునతో కలిసి శివకుమార్ ఆదివారం గుంటూరు జీజీహెచ్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లల జోలికి వస్తే తాటతీస్తానని చెప్పిన పవన్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.