ఆటోలో ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించవద్దని సీఐ అంజయ్య ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ తుళ్లూరులో ఆదివారం సాయంత్రం ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచి అమరావతికి అనేక మంది వస్తూ ఉంటారని వారిని జాగ్రత్తగా గమ్యాలకు చేర్చాలని వారికి సూచించారు. అనంతరం అధిక లోడుతో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం వద్దని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలని అన్నారు.