పొదిలిలో: వాహనదారులకు జరిమానా
పొదిలి పట్టణంలో శనివారం హెల్మెట్ ధరించకుండా నిబంధనలు పాటించకుండా వాహనాలు నడుపుతున్న వాహనదారులకు సీఐ వెంకటేశ్వర్లు జరిమానా విధించారు. తర్వాత వాహనదారులకు సీఐ కౌన్సిలింగ్ ఇచ్చారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వాహన సంబంధిత పత్రాలను దగ్గర ఉంచుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనం నడిపితే భారీ జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని వెంకటేశ్వర్లు వాహనదారులను హెచ్చరించారు.