మార్కాపురంలో రెచ్చిపోయిన దొంగలు
మార్కాపురంలోని భగత్ సింగ్ కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. జయ ప్రసాద్ ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు రూ. 2 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలను దొంగిలించి వెళ్లారు. వ్యక్తిగత పనులపై తెనాలి వెళ్లిన ఇంటి యజమానురాలు సోమవారం ఇంటికి వచ్చింది. ఇంట్లో దొంగలు పడ్డారన్న విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై సైదుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.