ఇంకొల్లు పట్టణంలో 30 అధునాతన సీసీ కెమెరాలతో నేర నియంత్రణ చర్యలు తీసుకుంటున్నట్లు ఇంకొల్లు ఎస్సై సురేష్ సోమవారం తెలిపారు. నూతన సీసీ కెమెరాల పనితీరుని ఆయన పరిశీలించారు. ఇంకొల్లులో ఎవరయినా నేరాలకు పాల్పడితే వీటి సాయంతో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. వ్యాపారస్తులు కూడా తమ తమ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. దాతలు సిసి కెమెరాలు ఏర్పాటుకు సహకరించాలని ఆయన కోరారు.