మదనపల్లెలో అయ్యప్ప భక్తులను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
మదనపల్లి మండలం చౌడేపల్లి వద్ద అయ్యప్ప భక్తులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చెడుగుట్ల గ్రామానికి చెందిన జయ ప్రకాష్, అతని చెల్లెలు స్వాతి అయ్యప్ప మాల ధరించారు. మంగళవారం మొక్కు తీర్చుకునేందుకు మోటార్ బైక్ పై బయలుదేరారు. చౌడేపల్లి వద్ద బస్సు ఢీకొట్టడంతో గాయపడిన వారిని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.