
కలకడ: భూ తగాదాలు.. నలుగురిపై దాడి
కలకడ మండలం గుండావాండ్లపల్లికి చెందిన వీరనాగుల నాయుడు 1ఎ. భూమిని అదే గ్రామానికి చెందిన చిన్నప్ప కుటుంబీకులు కబ్జా చేశారని.. గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వీరనాగులు తెలిపారు. ఇటీవల రెవెన్యూ సదస్సులో అర్జీతో తన భూమిలో సర్వే ప్రారంభమైందని, ఈ క్రమంలో చిన్నప్ప కుటుంభీకులు, అనుచరులు వీర నాగులుపై, బాలనాగు, నాగేశ్వర్, కాంతమ్మ, యశ్వంత్ నారాయణలపై తీవ్రంగా దాడి చేశారని బాధితులు తెలిపారు.