సన్మార్గంలో ఎవరు నడుచుకున్నవారికి భవబంధాల నుండి దేవుడు విముక్తి కలిగిస్తాడని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష అన్నారు. ఆదివారం కోటవీధిలోని బ్రహ్మకుమారీల ఆశ్రమంలో జరుగుతున్న కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బ్రహ్మకుమారీలు ఆశ్రమంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సత్ ప్రవర్తన, సన్మార్గం, ధ్యానం వల్ల కలిగే లాభాలను బ్రహ్మకుమారీలు తెలియజేశారు.