తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం చక్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా టీటీడీ చైర్మన్ బి ఆర్. నాయుడుతో కలసి నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేకి ఆలయ పండితులు అమ్మవారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు.