చిత్తూరు జిల్లా నగరి సబ్ డివిజన్ డి.ఎస్పీ గా సయ్యద్ మొహమ్మద్ అజీజ్ సోమవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2022 బ్యాచ్‌కు చెందిన డి.ఎస్పీ లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోస్టింగ్ లు జారీ చేసిన సందర్భంగా నగరి డిఎస్పీగా ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా సయ్యద్ మొహమ్మద్ అజీజ్ సమాజంలో శాంతి, భద్రత కాపాడటానికి తన పని నిబద్ధతతో చేయనున్నట్లు తెలిపారు.