వరదయ్యపాలెం మండలంలోని సంతవేలూరు చెరువు నిండి కలుజు పారుతున్న నీటి ప్రవాహాన్ని కలెక్టర్ డా. వెంకటేశ్వర్ సోమవారం పరిశీలించారు. చెరువుకు ఒక భాగంలో బలహీనంగా ఉన్న కట్ట వద్ద ఇసుక బస్తాలతో అడ్డు కట్ట వేసి అవసరమైతే కరకట్టను బలోపేతం చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ రాజశేఖర్, మండల అధికారులు పాల్గొన్నారు.