టీటీడీకి చెన్నైకి చెందిన దాత వర్ధమాన్ జైన్ ఆదివారం 6 కోట్ల విరాళం ఇచ్చారు. తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆయన ఎస్వీబీసీ కోసం రూ. 5 కోట్ల విలువైన డీడీ, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కోసం రూ. 1కోటి విలువైన డీడీలను టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ మేరకు దాతలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.