తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ఆదివారం నైవేద్యం సమయంలో పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో సినీ ప్రొడ్యూసర్ దానయ్య, సీరియల్ సినీ నటుడు రాజకుమార్ తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.