ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం నైవేద్య విరామ సమయంలో శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకి ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.