నేడు కాకినాడ జిల్లాలో షర్మిల పర్యటన
ఏలేరు వరద ప్రాంతాల్లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం పర్యటించనున్నారు. ఉదయం విజయవాడ నుంచి బయలుదేరి 11 గంటలకు రోడ్డు మార్గంలో పెద్దాపురం మండలం కాండ్రకోట చేరుకుంటారు. కాండ్రకోట గ్రామంలో వరదకు కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన, ముంపు ప్రాంతాలు పరిశీలించి బాధితులతో మాట్లాడుతారని జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు మీడియాకు తెలిపారు.