రంపచోడవరం: దసరా పండగ నుండి బోట్ టూరిజం "పునః ప్రారంభం "
గత మూడు నెలలుగా నిలిచిపోయిన పాపికొండలు బోర్డు టూరిజం పునర ప్రారంభమైంది. శుక్రవారం రాకపల్లి బోర్డ్ టూరిజం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాదిరెడ్డి సత్తిబాబు మాట్లాడుతూ పాపికొండలు అత్యంత ఆహ్లాదకరమైన విహారయాత్ర అని తెలిపారు. 21 బోట్లు అందుబాటులో ఉన్నాయనగా, 9 బోట్లకు పర్యాటక అనుమతులు వచ్చాయని, మిగిలిన వాటికి కూడా త్వరలో అనుమతులు రానున్నాయని చెప్పారు.