అల్లవరం: ఇచ్చిన హామీలను ఓఎన్జీసీ నెరవేర్చాలి
By K NAGA SRINU 63చూసినవారుఇచ్చిన హామీలను ఓఎన్జీసీ అధికారులు నెరవేర్చకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని అల్లవరం మండలం ఓడలరేవు గ్రామస్థులు మంగళవారం హెచ్చరించారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఓఎన్జీసీ కార్యకలాపాలతో తాము జీవనోపాధి కోల్పోయామని మహిళలు ఆవేదన చెందారు. ప్రతి యువకుడికి ఏడాదికి రూ. 20 వేలు పరిహారం అందించాలన్నారు. పోలీసులతో ఉద్యమాన్ని అణచాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.