అమలాపురం గడియార స్తంభం సెంటర్ పోస్టాఫీస్ కార్యాలయం వెనుక భాగంలో హైటెన్షన్ కరెంట్ వైర్లు తగిలి గురువారం రాత్రి కొబ్బరి చెట్టు దగ్ధమైంది. ఒక్కసారిగా చెట్టుపై పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు విద్యుత్తు శాఖ అధికారులకు సమాచారం అందించారు. సరఫరా నిలిపేసి. ప్రమాదం జరిగిన చోట మరమ్మతులు చేసి పునరుద్ధరించారు.