అమలాపురం: పిల్లికి పాలిచ్చి మాతృత్వాన్ని చాటుకున్న కుక్క

50చూసినవారు
కుక్క, పిల్లి విరోధ జంతువులు అయినప్పటికీ ఆకలితో ఉన్న పిల్లిపిల్లకి ఓ కుక్క పాలిచ్చి ఆకలి తీర్చింది. అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామంలో సోమవారం ఓ కుక్క పిల్లి పిల్లకు పాలు ఇచ్చి అక్కున చేర్చుకొని మాతృత్వ మమకారాన్ని పంచింది. అక్కడున్న స్థానికులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. పలువురు శునకం గొప్పతనాన్ని ప్రశంసిస్తున్నారు.

సంబంధిత పోస్ట్