అమలాపురం: సుబ్బాలమ్మను దర్శించుకున్న మంత్రి, ఎంపీ

66చూసినవారు
అమలాపురం: సుబ్బాలమ్మను దర్శించుకున్న మంత్రి, ఎంపీ
అమలాపురంలో కొలువు తీరిన పాలమ్మ తల్లిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఆదివారం దర్శించుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారిని ఘనంగా సత్కరించింది. విశ్వావసు నామ సంవత్సరం ఉగాది ప్రజల జీవితాల్లో కొత్త ఉషస్సులు తీసుకురావాలని వారు అభిలాషించారు. కొత్త ఏడాది ప్రజలందరికీ ఆనందం పంచాలన్నారు.

సంబంధిత పోస్ట్