అమలాపురం: బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే ఆనందరావు

51చూసినవారు
అమలాపురం: బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే ఆనందరావు
అమలాపురం రూరల్ మండలం సవరప్పాలెం గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసి అకాల మరణం చెందిన సత్తి రాంబాబు కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా రాంబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల మాజీ అధ్యక్షులు యెలుబండి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం సీనియరు నాయకులు మాజీ సర్పంచ్ నడింపల్లి ఉదయ్ బాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్