అమలాపురం పట్టణ కేంద్రం అమలాపురంలోని సావరం రోడ్డులో సాయిబాబా ఆలయం వెనుక శనివారం తాచుపాము హల్చల్ చేసింది. భయభ్రాంతులకు గురైన స్థానికులు భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న గణేష్ వర్మ పామును చాకచక్యంగా డబ్బాలో బంధించారు. వేసవికాలం సమయంలో పాములు చల్లదనానికి నివాస ప్రాంతాల్లోకి వచ్చే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు.