ఆత్రేయపురం: యువకుని పై ఫోక్స్ కేసు నమోదు

54చూసినవారు
ఆత్రేయపురం: యువకుని పై ఫోక్స్ కేసు నమోదు
ప్రేమ పేరుతో బెదిరిస్తున్న ఒక యువకుని పై ఫోక్స్ కేసు నమోదు చేసినట్లు ఆత్రేయపురం ఎస్ఐ ఎస్. రాము మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక తన అక్క, బావ వద్ద ఉంటూ చదువుకుంటుంది. అదే గ్రామానికి చెందిన గూడపాటి సంపత్ కుమార్ ప్రేమ పేరుతో వెంటపడి బెదిరిస్తుండటంతో బాలిక బంధువుల సహాయంతో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్