నల్లజర్ల మండలం తెలికిచర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శనివారం ప్రారంభించారు. తేమ శాతాన్ని పరిశీలించి రైతులకు ధాన్యం కొనుగోలు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులనకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు, అంజి, రామకృష్ణ, సుబ్బారావు, శ్రీనివాస్, సత్తిబాబు, సత్యనారాయణ సర్పంచ్ బండి చిట్టీ హాజరయ్యారు