ప్రజల జీవితాల్లో మిళితమైన ప్రసార సాధనాలు

161చూసినవారు
ప్రజల జీవితాల్లో మిళితమైన ప్రసార సాధనాలు
బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో రేడియో, దూరదర్శన్ లు ప్రజల జీవితాలలో ఒక ముఖ్యమైన భాగంగా మిళితమయ్యాయి అని న్యాయవాది రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జాతీయ ప్రసార దినోత్సవం పురస్కరించుకుని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 1927 జూలై 23న దేశంలో మొట్టమొదటిసారిగా బొంబాయి స్టేషన్ నుండి రేడియో ప్రసారాలు ప్రారంభమవడంతో అప్పటినుండి ఈ రోజున జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్