కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా ప్రయోజన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని బిజెపి కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఆదివారం సాయంత్రం కాకినాడ రూరల్ బిజెపి పార్టీ కార్యాలయంలో కాకినాడ రూరల్ మండలం బిజెపి సీనియర్ నాయకులు గీసాల శ్రీనివాసరావు కేంద్ర ప్రభుత్వ పథకాలతో ప్రత్యేకంగా రూపొందించిన క్యాలెండర్ను విశ్వేశ్వరరావు ఆవిష్కరించారు.