బీహార్ లో రెండు తుపాకీలు, 17 బుల్లెట్లు కొనుగోలు చేసి బ్యాంకు , ఏటీఎం దొంగతనం చేసేందుకు ప్లాన్ చేసిన చిటికెల నాగేశ్వరావు అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ సర్పవరం సర్కిల్ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు విశాఖపట్నంలోని మద్దిలపాలెం ప్రాంతంలో నివాసం ఉంటున్న చిటికెల నాగేశ్వరరావు ను అరెస్ట్ చేసామన్నారు.