కరప మండల పరిషత్ కార్యా లయం శిథిలావస్థకు చేరి ఇబ్బందులు పడేవారు. ఎండీవో అనుపమ 15 ఆర్థిక సంఘం నిధులు వెచ్చించి కార్పొరేట్ కార్యాలయం తరహాలో దీనిని తీర్చిదిద్దారు. మండల పరిషత్ ఏర్పడి ననాటి నుంచి ఆధునిక టెక్నాలజీతో కార్యాలయంను ఇలాఎపుడూ చూడలేదని అధికారులు ఆదివారం చెప్పారు. ప్రభుత్వ కార్యాలయంలా కాకుండా కార్పొరేట్ తరహాలో దీనిని తీర్చిదిద్దిన ఎండీవోను ఉద్యోగులు ప్రజా ప్రతినిధులు అభినందిస్తున్నారు.