కొత్తపేటలో బీజేపీ 45 వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం మండల అధ్యక్షులు సంపతి కనకేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగింది. జెండా అవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్రకార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం హాజరై జెండా ఎగురవేసారు. గొలకోటి వేంకటేశ్వర్రావు, యు ప్రసాదరాజు, పాలాటి మాధవస్వామి, అన్యం సత్యనారాయణ, పెన్నాడ నారాయణరావు, కుడిపూడి దావీదు, బుర్రా ఆంజనేయులు పాల్గొన్నారు.