మండపేట: ఆనందోత్సాహాలతో రంజాన్ పండుగను జరుపుకోవాలి

55చూసినవారు
మండపేట: ఆనందోత్సాహాలతో రంజాన్ పండుగను జరుపుకోవాలి
ముస్లిం సోదర సోదరీమణులు ఆనందోత్సాహాలతో రంజాన్ పండుగను జరుపుకోవాలని మండపేట మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి ఆకాంక్షించారు. మండపేటలో ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ముస్లిం సోదరులకు ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దాతృత్వం, దైవభక్తి, ఆధ్యాత్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసమని దుర్గారాణి అన్నారు.

సంబంధిత పోస్ట్