మండపేట శ్రీ రామ శెట్టిబలిజ సంక్షేమ సంఘం వారి 14వ వార్డు శెట్టి బలిజ నూతన రామాలయంలో వినాయకుడి, లక్ష్మి దేవి విగ్రహాలకు మున్సిపల్ చైర్ పర్సన్ నూక దుర్గారాణీ వెండి కిరిటాలను అందించారు. సుమారు లక్ష రూపాయలు విలువైన ఈ కిరీటాలను ఆదివారం సమర్పించారు. స్వామి వార్లకు విశేష పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ పెంకే గంగాధరం, నాయకులు తాడి రామారావు, శెట్టి నాగేశ్వరరావు, పాల్గొన్నారు.